27 April, 2026 | 5:32 AM

వాహన తనిఖీల్లో రూ. 18.75లక్షలు స్వాధీనం

11-05-2024 12:05 AM

కరీంనగర్  సిటీ, మే 10: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని ఐబీ చౌరస్తాలో కరీంనగర్ రెండో ఠాణా పోలీసులు శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.18,75,651 స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రెండో ఠాణా ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సరైన ఆధారాలు లేని రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన గుండి రమేశ్ నుంచి రూ.6 లక్షలు, మానకొండూర్ మండలం ఊటూరుకు పడాల హరీశ్ నుంచి రూ.12,75,651 స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారుల వద్దకు తరలించినట్టు పేర్కొన్నారు.