15 July, 2026 | 11:25 AM

కులగణనతోనే బీసీలకు న్యాయం

08-06-2024 01:59 AM

సర్వే తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: వీహెచ్

హైదరాబాద్, జూన్7 (విజయక్రాంతి): కులగణన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పేర్కొన్నారు. కొంత ఆలస్యమైనా కులగణన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసి కులగణన చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఓబీసీ అని చెప్పుకునే నరేంద్రమోడీ వెనుకబడిన వర్గాలకు ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని, రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్‌గాంధీ హామీని గుర్తు చేశారు. కానీ, బీజేపీ అధికారంలో వచ్చిందన్నారు.