calender_icon.png 5 September, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువు శ్యామల్ నాయక్ ను పరామర్శించిన న్యాయ వేదిక బృందం

05-09-2025 08:45:38 PM

శ్యామల్ నాయక్ త్వరగా కోలుకోవాలి

సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏషబోయిన సాంబయ్య యాదవ్

ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షులు సీనియర్ గురువు పోరిక శ్యామల్ నాయక్ ను పరామర్శించిన సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏషబోయిన సాంబయ్య యాదవ్ ఎంఆర్పీస్ జిల్లా అధ్యక్షులు ల్యాదేళ్ళ అశోక్ మాదిగ యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి కోరే రవి యాదవ్ న్యాయ వేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలాజీ (బబ్లూ)నాయక్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పులి వంశీ తదితరులు గురువు ఘంటశాల కళాకారులు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు పొరిక శ్యామల్ నాయక్ కాలికి ఆపరేషన్ జరిగి ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో వారిని కలిసి పరామర్శించడం జరిగింది.

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండే గురువు  అనారోగ్యానికి గురికావడం బాధాకరం శ్యామల్ నాయక్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం వారి జీవితం ప్రజల కోసమే వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండడం ఎంతోమంది కళాకారులు ఉద్యమ సంఘాలు సామాజిక కార్యకర్తలు బాదపడుచున్నారు వారు త్వరగా కోలుకోవాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచి గెలిచి ప్రజా సేవలో అతని శేష జీవితం కొనసాగాలని కోరుకుంటున్నాం అని సాంబయ్య యాదవ్ తెలిపారు