calender_icon.png 5 September, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీసీలోకి చొరబడిన వారిపై చర్యలు తీసుకోవాలి

05-09-2025 08:49:15 PM

కమిటీ సభ్యుల డిమాండ్ 

మాజీ డైరెక్టర్ జోబు లక్ష్మారెడ్డి హంగామా 

మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ మండలం డబ్బిల్ పూర్ లోని భారత బైబిల్ కాలేజీలోకి అక్రమంగా చొరబడిన మాజీ డైరెక్టర్ జోబు లక్ష్మారెడ్డి, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని సొసైటీ కార్యదర్శి మోజస్ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో డైరెక్టర్ గా పనిచేసిన జోబ్ లక్ష్మారెడ్డి, ఆయన అనుచరులు నిధులు దుర్వినియోగం చేశారని, ఫోర్జరీ సంతకాలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని, ఆస్తులు కాజేయాలని ప్రయత్నించారని తెలిపారు. 

ఈయను గతంలోనే డిస్మిస్ చేశామని, తాజాగా సోకాజ్ నోటీసు కూడా జారీ చేశామని తెలిపారు. క్రైస్తవ మిషనరీ ఫండ్స్ తో నడుస్తున్న ఈ కాలేజి ఆస్తులపై జీవరత్నం కుటుంబ సభ్యులు కెన్ని దామెర, ఎలిషాదామెరా , జోబు లక్ష్మారెడ్డి కలిసి నిబంధనలకు విరుద్ధంగా స్కూలు నిర్వహించారన్నారు. సోకజ్ నోటీసు జారీ చేయగానే జాబు రెడ్డి కాలేజీ ప్రాంగణానికి వచ్చి హంగామా చేశారన్నారు. బాడీగార్డ్లను తీసుకువచ్చి గొడవ సృష్టించాడని ఆయన తెలిపారు. కాలేజీలోకి అక్రమంగా ప్రవేశించిన జోబు లక్ష్మారెడ్డిని, ఆయన అనుచరులను బయటకు పంపాలని, సంస్థను కాపాడాలని ఆయన కోరారు.