13 July, 2026 | 1:06 AM

నేరెళ్ల ఘటన బాధితులకు న్యాయం చేయాలి

13-07-2026 12:15 AM

కాంగ్రెస్ డిమాండ్

తంగళ్ళపల్లి, జూలై 12 (విజయ క్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగల రాజు ఆధ్వర్యంలో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ టోనీ నేరెళ్ల ఘటనపై స్పందించారు. అనారోగ్యంతో మృతి చెంది న నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్కు నివాళులర్పించిన ఆయన, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భం గా మాట్లాడుతూ, నేరెళ్ల ఘటనలో జరిగిన పోలీసు థర్డ్ డిగ్రీ, బాధితులు ఎదుర్కొన్న ఇ బ్బందులకు కేటీఆర్ రాజకీయంగా, నైతికం గా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ప్రకటించిన ఆర్థిక సాయం సరిపోదని, వారికి సమగ్ర న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

నేరెళ్ల బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగల రాజు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు నేరెళ్ల నర్సింగం గౌడ్, కట్కం రాజు, శ్రీకాంత్,  పరుశురాం, ఆరేపల్లి బాలు , మిర్యాల  శ్రీనివాస్, చోటు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.