28 February, 2026 | 1:58 PM

ఆర్ అండ్ ఆర్ కాలనీ సమస్యలపై పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలి

28-02-2026 02:05 AM
  1. మున్సిపల్‌లో విలీనం జీవో ఇచ్చిన నాటి నుండే ఆస్తి పన్ను స్వీకరించాలి 

బీఆర్‌ఎస్ నాయకులు సంతోష్

గజ్వేల్, ఫిబ్రవరి 27: గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులకు పార్టీలకు అతీతంగా అండగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి కృషి చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ నాయకు లు ఎన్ సీ సంతోష్ అన్నారు ఆర్ అండ్ ఆర్ కాలనీని మున్సిపల్ లో విలీనం చేస్తూ జీవో వచ్చిన నాటి నుండే ఆస్తి పన్ను వసూలు చేయాలంటూ శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం ఎన్ సీ సంతోష్ విలేకరులతో మాట్లాడారు. గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసుల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు.

ఆర్ అండ్ ఆర్ కాలనీవాసులకు ఇంటి పన్ను గత ఆరు సం వత్సరాల నుండి కట్టవలసిందిగా మున్సిపల్ అధికారులు వత్తిడి తెస్తున్నారని, గత ఆరు సంవత్సరాల క్రితం గజ్వేల్ వచ్చిన ఆర్ అండ్ ఆర్ కాలనీవాసులకు మున్సిపల్ ద్వారా ఎలాంటి సేవ లు, అభివృద్ధి కార్యక్రమాలు అందలేదని, అలాంటిది వారికి ఇంటి పన్ను కట్టాలని అడగడం భావ్యం కాదన్నారు.

2026 జనవరి నుండి మున్సిపల్ లో విలీనమైనట్టు నేను వచ్చిన జీవో ప్రకారమే 2026 జనవరి నుండి ఇంటి పన్ను తీసుకోవాలని లేదా మానవతా దృక్పథంతో, వచ్చే పది సంవత్సరాల వరకు ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసులకు ఇంటి పన్ను తీసుకోకుండా సహకరించాలని డిమాండ్ చేశారు. ఉన్న ఊరును, భూములను వదులుకొని ఇక్కడికి వచ్చారని, వారి త్యాగం ద్వారానే కాలేశ్వరం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్మాణం జరిగి ఇక్కడ రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.