సహస్ర తల్లిదండ్రులకు న్యాయం చేయాలి
పెద్దపల్లి (మంథని), జూన్15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలో చిన్నారిపై హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్ర హావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత దారుణం జరిగినా అధికార కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం పట్ల మండిపడుతు న్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా ప్రాణం తీసిన నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బీఆర్‌ఎస్ నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి బాధిత కుటుంబంతో కలిసి రోడ్డుపై బైటాయించారు. చిన్నారి కుటంబానికి ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబానికి అమానుషం జరిగితే అధికారంలో ఉన్న ఒక్క నాయకుడూ వీరి పక్షాన నిలవకపోవడం సిగ్గుచేటన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కామాంధుడిన్ని కఠినంగా శిక్షించాలి
ఆరేండ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీలో పీవోడబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ, పీవైఎల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. పీవోడబ్ల్యూ జ్యోతి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
- దారుణం జరిగినా అధికార పార్టీ నాయకులు రారా?
- బీఆర్‌ఎస్ నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి
- ఎన్టీపీసీలో పీవోడబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ, పీవైఎల్ ఆధ్వర్యంలో నిరసన
కాట్నపల్లి ఘటనపై విచారణకు ఆదేశం
- సుమోటోగా తీసుకున్న బాలల హక్కుల కమిషన్
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య చేసిన ఘటనలో న్యాయ విచారణకు తెలంగాణ బాలల హక్కుల కమిషన్ ఆదేశించింది. వివిధ దిన పత్రికలలో ప్రచురితమైన కథనాల మేరకు సుమోటోగా టీజీఎస్‌సీపీసీఆర్, చైర్మన్ జే శ్రీనివాస్‌రావు ఆదేశాలు జారీ చేశారు. సత్వరం విచారణ జరిపి దోషులను పట్టుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలిపే ఏటీఆర్‌ను తక్షణమే పంపించాలని పెద్దపల్లి కలెక్టర్‌ను ఆదేశించారు.






