ఈసెట్‌లో జ్యోతిష్మతి సత్తా
కరీంనగర్ సిటీ, జూన్ 6 : ఈసెట్ ఎంట్రెన్స్‌లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. జే సాయికిరణ్ (ఈసీఈ) 87వ ర్యాంకు సాధించగా రూ.50 వేలు, డీ గోపీ (సీఎస్‌ఈ) 125వ ర్యాంకు సాధించడంతో రూ.20 వేలు, ఏ నిషీద (సీఎస్‌ఈ) 178వ ర్యాంకు సాధించగా రూ.20 వేలు, ఎస్ మౌర్య (ఈఈఈ) 185వ ర్యాంకు సాధించగా రూ.20 వేల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా సాగర్‌రావు మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించడమే జ్యోతిష్మతి విద్యాసంస్థల లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులు మరింత ప్రతిభ కనబర్చి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రావు, అకాడమిక్ డీన్ డాక్టర్ పీకే వైశాలి, సజన్‌రావు, విభాగాధిపతులు పాల్గొన్నారు.






