నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్‌పైకి
26-05-2024 02:09 AM
అతిపిన్న వయస్కురాలిగా కామ్య రికార్డు
న్యూఢిల్లీ, మే 25: నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే అతిపిన్న వయ స్కురాలిగా నేవీ అధికారి కూతురు కామ్య కార్తికేయన్ రికార్డు సాధించింది. 16 ఏళ్ల కామ్య ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి నేవీ కమాండర్ కార్తికేయన్‌తో కలిసి ఏప్రిల్ 3వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు యాత్ర ప్రారంభించింది. ఈ నెల 20న నేపాల్ వైపు నుంచి ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది. ఈ విషయాన్ని భారత నావికా దళం వెల్లడించింది. కామ్య ఫొటోను జోడించి వివరాలను ట్వీట్ చేసింది. అలాగే ఆరు ఖండాల్లోని ఎత్తున శిఖరాలను అధిరోహించిన రికార్డును కూడా కామ్య సొంతం చేసుకుంది.






