24 May, 2026 | 5:28 AM

జగిత్యాల జిల్లాలో వింత కోడి

17-06-2024 06:35 PM

జగిత్యాల : మందు తాగే కోతులు, గుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసే కుక్కలు, పందుల ఘటనలు గతంలో చూశాం. మరికొన్ని చోట్ల ఇతర జంతువులకు పాలిచ్చే ఆవులను, కుక్కలను చూశాం. అయితే తాజాగా ఓ కడక్ నాథ్ కోడి చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తికి కోళ్ల ఫాం ఉంది. ఆ కోళ్ల ఫారంలోనే ఓ కడక్ నాథ్ కోడి యజమాని చెప్పినట్లు చేసి అందరిని విస్మయానికి గురిచేస్తోంది. వెనక్కి రమ్మంటే వెనక్కి.. ముందుకు వెళ్లమంటే ముందుకు వెళ్లి అందరిని షాక్కు గురి చేస్తోంది. ఇక, ఈ ఘటనపై కోడి యజమాని మాట్లాడుతూ..తనకు కోళ్లఫారం ఉందని అందులో 200 కడక్ నాథ్ పెంచుతున్నట్లు తెలిపారు. అందులో ఒక కోడికి తానంటే ఇష్టమని తన చుట్టే తిరుగుందన్నారు. వింటుందన్నాడు. ముందుకెళ్తుందని తాను చెప్పినట్లు ముందుకెళ్లమంటే కోడి వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుందని మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం కోడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.