22 May, 2026 | 8:56 PM

Breaking News

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •  

కేఎల్‌హెచ్‌లో కళా ఉత్సవ్

23-03-2025 12:34 AM

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): కేఎల్‌హెచ్ హైదరాబాద్‌లో 21, 22 తేదీల్లో బచ్చుపల్లి క్యాంపస్‌లో కళా ఉత్సవ్ ఘనంగా నిర్వహించారు. కేఎల్‌హెచ్ వైస్ ప్రెసిడెంట్ కొనేరు హవీష్ ఉత్సవాలను ప్రారంభించారు.

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు కేఎల్‌హెచ్ స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ (ఎస్‌ఏసీ), తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి వేడుకకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, కళాకారులు, నర్తకులు, సంగీత కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు, సినీ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు.

మూడు వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. నవీన్ కుమార్ (ఐఏఎస్ యూపీ), సినీ నటుడు ప్రణవ్ కౌశిక్, సీడ్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు కిషోర్ ఇండుకూరి, చైర్‌పర్సన్, డైరెక్టర్ ఎస్‌ఏసీ ఇంజి పి. సాయివిజయ్, ప్రిన్సిపాల్ డా.ఎల్. కోటేశ్వరరావు,  ప్రిన్సిపాల్ డా.రామకృష్ణ ఆకెళ్ల డా. జి. రాధాకృష్ణ, కన్వీనర్ శ్రీ జి. ప్రేమ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.