15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

కాలభైరవ స్వామి ఉత్సవాలు ప్రారంభం

10-11-2025 12:17 AM

కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసనపల్లి గ్రామాలలో వెలసిన కాలభైరవ స్వామి జన్మదిన ఉత్సవాలు ఆదివారం ప్రారంభమ య్యాయి. గురువారం వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈవో ప్రభు తెలిపారు. బద్ది పోచమ్మ బోనాలు కార్యక్రమం తో ఉత్సవాలు ప్రారంభమైనట్లు తెలిపారు. సోమవారం లక్షదీపార్చన, మంగళవారం కాలభైరవుని డోలారోహణం, జన్మదినోత్సవం, బుధవారం రథోత్సవం, రక్ష యజ్ఞ ము, అగ్ని గుండాలు, బండ్ల ప్రదర్శన, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో  కాలభైరవ స్వామి జన్మదిన ఉత్సవాల లో పాల్గొనాలని ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా, అర్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.