calender_icon.png 10 November, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట ఆడుతున్న నలుగురు అరెస్ట్

10-11-2025 12:18:55 AM

రూ.12,510 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం 

ఎల్లారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని  పక్క సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ బ్రాహ్మణపల్లి పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్న సంఘటన స్థలానికి చేరుకొని ఆదివారం నలుగురిని పట్టుకున్నట్లు తెలిపారు.

నలుగురు నుండి రూ.12,510 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి ఆక్రమణ జూద కార్యకలాపాలల్లో పాల్గొన కుండా ఉండాలని శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్సు కోరారు. అక్రమంగా జూదం ఆడిన వారిపై చర్యలు చేపడతామని తెలిపారు..