calender_icon.png 10 November, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ టు బెంగళూరుకు బస్సు సర్వీస్

10-11-2025 12:16:01 AM

బాన్సువాడ, నవంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపో నుంచి బెంగళూరుకు ప్రతిరోజు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు బాన్స్వాడ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ప్రతిరోజు బాన్సువాడ నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు బయలుదేరి ఎల్లారెడ్డి మెదక్ జె పి ఎస్ ఎం జి బి ఎస్ మీదుగా జడ్చర్ల, కర్నూల్, అనంతపూర్, మీదుగా మరుసటి రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుందని డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. బెంగళూరు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ  సెమీ లగ్జరీ బస్సులో వెళ్లవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.