02-12-2025 06:52:23 PM
మోతే (విజయక్రాంతి): అన్నారి గూడెం గ్రామ సర్పంచ్ పదవికి కలకొండ లయ చంటి మంగళవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి పట్ల స్పష్టమైన దృష్టి, ప్రజాసేవ పట్ల నిబద్ధతతో ముందుకు వచ్చిన లయ చంటికు గ్రామస్తులు, యువత, పెద్దఎత్తున మద్దతు తెలిపారు. నామినేషన్ కార్యక్రమం ఉత్సహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా కలకొండ లయ చంటి మాట్లాడుతూ గ్రామ ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పరిపాలన నా లక్ష్యం. అన్నారి గూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు నాయకత్వంలో మార్పు కోరుతున్న నేపథ్యంలో కోళ్ల లింగ అభ్యర్థిత్వానికి విస్తృత ప్రజాభిమానం లభిస్తుంది.