02-12-2025 06:49:53 PM
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో మహాధర్నా
జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలి
టియూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్
వనపర్తి టౌన్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు టీయూడబ్ల్యూజే(ఐజేయు) ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని టీయూడబ్ల్యూజే(ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మహాధర్నకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని అనుకున్నప్పటికీ గత రెండేళ్లుగా జాప్యం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేడు రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం కమిషనర్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అక్రెడిటేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందనీ, హెల్త్ కార్డులకు దిక్కులేదు. ఇక ఇళ్ల స్థలాలు అందని ద్రాక్షలా మరాయని చెప్పారు. వృత్తీ కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలనీ,సంక్షోభంలో ఉన్న చిన్న మధ్యతరగతి పత్రికలను ఆదుకోవావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మన యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినీ ఎన్నోసార్లు కలిసి చర్చించడంతో పాటు వినతి పత్రాలను అందించింది. కానీ గత 20 నెలలుగా అక్రెడిటేడేషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి పాత అక్రెడిటేషన్ కార్డులను పలు దఫాలుగా రెన్యూవల్ చేస్తున్నారు తప్ప కొత్త కార్డులు ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే, ఇదిగో, అదిగో అంటూ వాయిదాలు వేస్తున్నారు తప్ప కార్యరూపం దాల్చటం లేదనీ విమర్శించారు.
ప్రభుత్వ సాచివేత ధోరణికి నిరసనగా డిసెంబర్ 3న, ఉదయం 10 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహించి మన ధర్మాగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం జరిగిందని అన్నారు. మహాధర్నాలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాధవరావు బి.రాజు, జాతీయ కౌన్సిల్ నెంబర్ ప్రశాంత్ రాష్ట్ర హౌసింగ్ కమిటీ మెంబర్ శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి మన్యం, జిల్లా ఉపాధ్యక్షులు నా కొండ యాదవ్, కమల్ రెహమాన్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా నాయకులు పికిలి రాము, రవికాంత్, టౌన్ అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ ఆంజనేయులు నాయకులు విష్ణు, సురేష్, ఫారుక్ పటేల్, దాచ హరీష్ కుమార్, మహేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.