కాళేశ్వరంపై విచారణ నవంబర్ 12కు వాయిదా
-మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు
-కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 7(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ ౧౨వ తేదీకి వాయి దా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడి గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్ట కూడదని కేసీఆర్, హరీశ్‌రావు తమ పిటిషన్లలో వాదించారు.
ఆ నివేదికను పూర్తిగా రాజకీయ ఉద్దేశ్యంతో రూపొందించారని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం చట్టపరంగా సరైంది కాదని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కమిషన్ తరఫున లాయర్ నిరంజ న్‌రెడ్డి ఈ విచారణ సందర్భంగా అఫిడవిట్ సమర్పించకపోవడంపై క్షమాపణలు కోరా రు. కొన్ని వివరాలు సేకరించడంలో జాప్యం జరిగిందని, త్వరలోనే సమగ్రమైన కౌంటర్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు.
హైకోర్టు ఆయన వివరణను అంగీకరించి తదుపరి విచారణ తేదీని నిర్ణయించింది. అలాగే ఇదే కేసులో మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబ ర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా ఉన్న త న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కమిషన్ నివేదికలో తమ పేర్లు ప్రస్తావించబడిన నేపథ్యంలో ప్రభు త్వం తమపై చర్యలు తీసుకోకుండా ఉండాలని వారు కోర్టును ఆశ్రయించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీబీఐకి పంపిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు ఆ నివేదిక ఆధారంగా నేరుగా చర్యలు చేపట్టకూ డదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ తన స్వతంత్ర విచారణను చట్టపరమైన విధానాల ప్రకారం కొనసాగించవచ్చని పేర్కొం ది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ వచ్చే నెల ౧౨న జరగనుంది. అప్పటి వరకు కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.




