calender_icon.png 8 October, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌డీఎస్‌ఏ సిఫారసుల మేరకే.. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ

08-10-2025 01:21:45 AM

  1. పరిశీలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలు
  2. ఎస్‌ఎల్‌బీసీని 2027 వరకు పూర్తి చేస్తాం 
  3. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారి టీ (ఎన్‌డీఎస్‌ఏ) సిఫారసుల మేరకే జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికా రులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  సమీక్షించా రు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత  జాబితాలో ఉన్నాయని వెల్లడించారు. 

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి భాగాన్ని మొదటి అంశంగా తీసుకుని.. రెండు ప్రత్యామ్నాయ కాలువల మార్గాల ను ఇంజనీరింగ్ బృందాలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఇందులో ఒకదానిపై అక్టోబర్ 22 నాటికి నిర్ణ యం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

మైలారం నుంచి 71.5 కి.మీ. గ్రావిటీ కాలువ, 14 కి.మీ సొరంగం ద్వారా సుందిళ్లకు తరలించడం, లేదా మరో మార్గం ప్రకారం.. మధ్యలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లి ద్వారా నీటిని మళ్లిస్తామని వివరించారు. ఈ రెండు ప్రత్యామ్నాయా ల ఖర్చు, హైడ్రాలిక్ సామర్థ్యం, భౌగోళిక అనుకూలత, విద్యుత్ అవసరాలపై సమీక్షించినట్టు మంత్రి తెలిపారు.

ఆలస్యం జరిగితే బాధ్యత వహించాలి

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పూర్తి స్థాయి రూపకల్పన ఏడాదిలో పూర్తవుతుంద ని మంత్రి తెలిపారు. ఈ పనుల్లో పాల్గొనాలని ప్రభుత్వం జాతీయ సంస్థలు, నిపుణుల సంస్థలను కోరిందని మంత్రి తెలిపారు. ఇది తెలం గాణకు చెందిన సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేష న్ (సీడీవో)తో కలిసి పని చేస్తుందని తెలిపారు. ఐఐటీ బృందం రూపకల్పన, పరీక్షలు, పునరుద్ధరణ ప్రణాళికను చేపడుతుందని తెలిపారు. 

పునరుద్ధరణ ప్రక్రియ ఎన్‌డీఎస్‌ఏ సిఫారసులకు అనుగుణంగా కచ్చితంగా ఉంటుందని, ఏదైనా వ్యత్యాసం, ఆలస్యం జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. వారానికి ఒకసారి పనుల పురోగతిపై సమీక్షించి, సాంకేతిక ఫలితాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజీల భద్రత అత్యంత ప్రాధాన్యమైనది. ప్రతి దశలో జాతీయ స్థాయి సంస్థలు పాల్గొంంటూ శాస్త్రీయ, పారదర్శక, సవరణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నామని మంత్రి తెలిపారు. 

వాదనల్లో ఏకరూపత ఉండాలి

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ ముందు జరుగుతున్న విచార ణపై కూడా మంత్రి సమీక్షించారు. సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణ తరఫున వాదనలు ముగించారని, ఆంధ్రప్రదేశ్ తమ వాదనలను ప్రారంభించిందని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని న్యాయ బృందం, రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని, వాదనల్లో ఏకరూపత ఉండాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

సమ్మక్క ప్రాజెక్టునుకూడా సమీక్షించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)ని సంప్రదించి నీటి కేటాయింపు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం కోరిందని, ఈ ప్రక్రియ వేగంగా సాగుతుందని అధికారులు తెలిపారు.

సీతమ్మసాగర్, మోదికుంటవాగు, చనాక పంపిణీ వ్యవస్థ లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడి ఆమోద దరకాస్తులను ఢిల్లీలో సమర్పించామని, ఇవి ప్రధాన మంత్రి కృషి సం చయీ యోజన (పీఎంకేఎస్‌వై) పరిధిలో ఉం దని, కేంద్రం ఆమోదం వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టులు గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాం తంలో నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచుతాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ అదనంగా మూడో దశ ప్యాకేజీలకు ఆమోదం లభించిందని తెలిపారు. భూసేకరణకు రూ. 33 కోట్లు తక్షణమే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.   

ఉన్నతస్థాయి పర్యవేక్షణలో ఎస్‌ఎల్‌బీసీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ శ్రీశైలం జలాశయాన్ని కరువు ప్రాంతాలతో అనుసంధానిస్తూ 43 కి.మీ పొడవైన టన్నెల్ ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించారని తెలిపారు. సాంకేతిక, పరిపాలనా అడ్డంకులను తొలగిస్తున్నామని, ప్రాజె క్టు పూర్తయ్యేవరకు ఉన్నతస్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు.