calender_icon.png 13 November, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి

13-11-2025 06:51:10 PM

నకిరేకల్ (విజయక్రాంతి): పోరాటాల పురిటి గడ్డ సూర్యాపేట పట్టణంలో ఈనెల 28, 29, 30 తేదీలలో జరిగే కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండేంపల్లి శ్రీనివాస్ కోరారు గురువారం కట్టంగూర్ మండలంలోని నారేగూడెం గ్రామంలో పాల్గొని మహాసభల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 28వ తేదీన మహాసభలు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన, గొప్ప బహిరంగ సభ జరుగుతున్నదని, దీనికీ జిల్లా నలుమూల నుండి గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని ఆయన కోరారు.

రెండు రోజులు పాటు ఎంపిక చేయబడిన ప్రతినిధులతో ప్రతినిధులతో మహాసభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ సభ్యుడు ఆకుల శంకరయ్య గ్రామ అధ్యక్షుడు ఆకుల నాగరాజు గీత కార్మికులు అంతటి శ్రీను ఆకుల ఎల్లయ్య ఆకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.