calender_icon.png 13 November, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

13-11-2025 06:52:41 PM

ఆలయ చైర్మన్ నలపాటి నరసింహారావు..

కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలోని సాయి మందిరంలో దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటీనిడి శ్రీనివాసరావు సుజాత దంపతులు అన్నదాతలుగా వ్యవహరిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నల్లబండగూడెం గ్రామానికి చెందిన  హేమశ్రీ  హైదరాబాదులోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అసాధారణ ప్రతిభను కనబరిచి రెండు బంగారు పతాకాలను దక్కించుకోవడంతో ఆమెను ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారావు, శరభయ్య, ఆదినారాయణ, రామారావు, కొత్త గురవయ్య, శివరామకృష్ణ పాపారావు, అర్చకులు సాయి శర్మ, తదితరులు పాల్గొన్నారు.