30 June, 2026 | 2:13 AM

పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఒక వరం

30-06-2026 12:00 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్ర నగర్ జూన్ 29 (విజయ క్రాంతి) ః పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అన్నారు గండి పేట మండల పరిధిలోని లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 29 మంది లబ్ధిదారు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మొత్తం రూ.29 లక్షల 3,364వేల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో  తహసిల్దార్ కార్యాలయ  సిబ్బంది స్థానిక నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.