మహిళా హక్కుల సాధన కోసం ఉద్యమించాలి
మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి
మణుగూరు, జూన్ 29 (విజయక్రాంతి): మహిళలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి పిలుపునిచ్చారు. సోమవారం మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో బోలగని సమ్మక్క, కోడిమెల సుజాత అధ్యక్షతన మహిళా సమైక్య మహాసభ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీకుమారి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ వారిపై దాడులు, ఈవ్టీజింగ్, ర్యాగింగ్ వంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు చట్టా సభలలో రిజర్వేషన్లు కల్పించి, మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభు త్వం రాజకీయాలు చేస్తోందని విమర్శిం చారు. కార్యక్రమం ముగింపులో 19 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహిళా సమైక్య నాయకులు విసం చెట్టి పద్మజ, మామిడాల ధనలక్ష్మి, రత్నకు మారి, ఎస్కే షాహిని, సర్పంచ్ చిడం ఉషారాణి, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






