30 June, 2026 | 1:42 AM

100 శాతం పల్స్ పోలియో పూర్తి చేయాలి

30-06-2026 12:00 AM

కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, జూన్ 29 (విజయక్రాంతి): ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చు క్కలు వేసి నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చే యాలని, చుక్కలు తప్పిపోయిన వారిని రెం డు రోజుల్లో గుర్తించి చుక్కల మందు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్యశాఖ సిబ్బం దిని ఆదేశించారు. సోమవారం చిగురు మామిడి మండల కేంద్రంలో ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలు ఉన్న ఓ ఇంటిని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియోలో పో లియో చుక్కలు వేయించారా లేదా అని కు టుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఆశ, ఏఎన్‌ఎంలతో పల్స్ పోలియో గురించి ఆరా తీశారు. గ్రామంలో ఐదేళ్ల లోపు ఉన్న పిల్లల సంఖ్య, పోలియో చుక్కలు వేసుకున్న వారి శాతం తదితర వివరాలు అడిగారు. సోమ, మంగళవారాల్లో ప్రతి ఇంటిని సందర్శించి పోలియో చుక్కలు వేయని పిల్లలను గుర్తించాలని, వారికి తప్పక చుక్కల మందు వేయాలని ఆదేశించారు. నూరు శాతం ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేసి కార్య క్రమాన్ని విజయంతం చేయాలని అన్నారు. 

మండల కేంద్రంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్.ఐ.ఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బి ఎల్ ఓ లకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సూపర్వైజర్లు, బిఎల్‌వోలు సమన్వయంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. కలెక్టర్ వెంట సర్పంచ్ భవాని, ఏఎన్ ఎం లక్ష్మి, గ్రామ కార్యదర్శి రమేష్ ఉన్నారు.