calender_icon.png 14 January, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియా ప్రత్యక్షమా.. పరోక్షమా?

14-01-2026 12:15:57 AM

  1. చైర్మన్ పదవికి డైరెక్ట్ ఎలక్షన్‌పై చర్చ 
  2. హీటెక్కిస్తున్న టౌన్ పాలిటిక్స్

సంగారెడ్డి, జనవరి 13(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ సారి చైర్మన్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక ఉంటుం దనే చర్చ మొదలైంది. పోటీకి సిద్ధమంటూ ఆశా వహులు కూడా సంకేతాలిస్తున్నారు. అయి తే ఇప్పటివరకు ఈ అంశంపై టీపీసీసీ సమావేశా ల్లో ఎలాంటి అభిప్రాయం అడగలేదని అధికార కాంగ్రెస్ ముఖ్యనేతలు పేర్కొంటున్నారు.

అయితే ఈసారి చైర్మన్ పదవికి ప్రత్యక్షమా లేక పరోక్షమా అనేది సందిగ్ధంగా మారింది. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారిపోనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీ పీఠాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. 

గతంలో ప్రత్యక్షమే..

గతంలో చైర్మన్ పదవి కోసం ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తర్వాత పరోక్ష ఎన్నికలు ని ర్వహిస్తూ వస్తున్నారు. ఈ పద్దతిలో మెజార్టీ కౌ న్సిలర్లు ఉన్న పార్టీలు ఆ సభ్యుల నుంచి ఒకరిని చైర్మన్ గా ఎన్నుకోవడం చూస్తున్నాం. ప్రత్యక్ష ఎ న్నికలు నిర్వ హిస్తే మాత్రం చైర్మన్ పదవి కోసం నేరుగా పోటీ నెలకొంటుంది. తద్వారా పట్టణ ఓటర్లు ఇటు చైర్మన్ కోసం.. అటు కౌన్సిలర్ కోసం రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ అంశంలో ఎలాంటి స్పష్టత లేదు.

‘హస్తం’కు లాభిస్తుందా..

చైర్మన్ పదవి కోసం ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తే అధికార కాంగ్రెస్కు లాభిస్తుందా అనే అంశం అధిష్టానం పరిశీలనలో ఉందనే ప్రచారం లేకపో లేదు. సర్పంచ్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు గెలిచినప్పటికీ రా ష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ రెండో స్థానంలో నిలవడం, స్వతంత్రులు మూడో స్థానం, బీజేపీ నాలుగో స్థానంలో నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తర్జనభర్జన నెలకొంది. ఓ దశలో మొదట పరిషత్ ఎన్నికలు ఉంటాయనే ప్రచారం సాగింది. సర్పం చ్ ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ ఎన్నికలకు కాకుండా మున్సిపల్ వైపు దృష్టి సా రించింది.

పట్టణ ప్రాంతాల్లో జరిగే ఈ ఎన్నికల ద్వారా అధికార పార్టీ బలాన్ని పూర్తిస్థాయిలో చూపెట్టాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్ ఎలక్షన్ అంశం కూడా పరిశీలనలో ఉందనే అంటున్నారు. అయితే దీనిపై జిల్లాల వారీగా నేతల నుంచి మాత్రం ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయకపోవడం గమనార్హం.

ముందు వరుసలో యువ నేతలు...

ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిగితే పలువురు ముఖ్య నేతల కుటుంబ సభ్యులు, సం బంధీకులను చైర్మన్ ఎన్నిక కోసం రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు చేస్తున్నారనే ప్రచారం ఆయా పార్టీల్లో వినిపిస్తుంది.

అయితే ఈసారి రాజకీయ ఎత్తుగడ మారినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మెదక్ ము న్సిపాలిటీలో సీనియర్లను పక్కనబెట్టి పార్టీ కోసం కష్టపడ్డ యువ నేతలకు అవకాశం ఇచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు వారే దిక్కు అన్న మాట నుంచి తామున్నామంటూ యువ నేతలు సైతం జై కొడుతున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ ఉంటే మాత్రం బడాబాబులు రంగంలోకి దిగే పరిస్థితి ఉన్నట్లుగా పట్టణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.