31 July, 2026 | 5:52 AM

సుప్రీకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్.. ఎందుకంటే?

23-06-2024 08:03 PM

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో ఆయనకు గురువారం ట్రయల్ కోర్టు రూ. లక్ష పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు ఇచ్చిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు ఈడీ ఆశ్రయించింది.

దీంతో బెయిల్ ఆర్డర్ పై స్టే విధించాలని కోరగా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మధ్యంతర స్టే ఉంటుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేజ్రీవాల్ ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను ఢిల్లీ కోర్టు నిలుపుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీకోర్టు తలుపుతట్టారు. ఢిల్లీ ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీ వివాదాలకు దారితీసింది. ఈ పాలసీతో చాలా మంది ప్రముఖులు అవకతవకలకు పాల్పడ్డరని ఈడీ పేర్కొంది.