13 April, 2026 | 7:55 AM

తలైవాతో కమల్ చిత్రం ఖరారు

06-11-2025 01:20 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ‘జైలర్2’లో నటిస్తున్న తలైవా త్వరలో మరో సంచనల కాంబినేషన్‌కు ఓకే చెప్పారు. ‘కూలీ’ చిత్రం తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబోలో ఓ సినిమా రాబోతోందంటూ ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. ఈ కాంబోపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది.

కమల్‌హాసన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజనీకాంత్ తన కెరీర్‌లోని 173వ చిత్రాన్ని చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు సుందర్ సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ బ్యానర్ స్థాపించి 44 ఏళ్లు కావడంతో ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.