06-11-2025 01:19:14 AM
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. హీరోయిన్ జాన్వీకపూర్ ఇందులో చరణ్ ప్రేమికురాలిగా కనిపించనుంది.
శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా నుంచి టీమ్ ఫస్ట్ సింగిల్- ‘చికిరి చికిరి’ని ఈ నెల 7న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు. చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాట పుట్టిన సందర్భం గురించి మాట్లాడుకోవటంతో ఈ వీడియో ప్రారంభమైంది.
ఆ తర్వాత రెహమాన్ స్వరపర్చిన హై వోల్టేజ్ బీట్స్‌ను, అందుకు అనుగుణంగా రామ్‌చరణ్ వేసిన హుక్‌స్టెప్‌ను చూపించారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026, మార్చి 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.