వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ
ఐపీఎస్ అధికారి కాజోల్ సింగ్ చొరవ
కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు
కామారెడ్డి, మే 10 (విజయక్రాంతి): సుమారు రెండేళ్ల క్రితం నమోదైన మహిళ మిస్సింగ్ కేసును కామారెడ్డి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కామారెడ్డి డీఎస్పీ కార్యా లయంలో శుక్రవారం ట్రైనీ ఐపీఎస్ కాజోల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం లక్ష్మీనగర్ తండా కు చెందిన లంబాడీ సంధ్య (28) 2022 సెప్టెంబర్ 14న కామారెడ్డిలో కూలి పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త లింబాద్రి భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, కొన్నాళ్ల తర్వాత కొన్ని కారణాలతో కేసును మూసివేశారు. ఇటీవల ట్రైనీ ఐపీఎస్ కాజోల్ సింగ్ మిస్సింగ్ కేసు ను తిరిగి తెరిచారు. సంధ్య ప్రియుడే ఆమె ను హత్య చేశాడని ఆధారాలు సేకరించి కేసు ను ఛేదించారు. దోమకొండ మండలం చింతమాన్‌పల్లికిచెందిన జంగంపల్లి మహేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ సంధ్యను పరిచయం చేసుకున్నాడు. అది కాస్తా వివాహే తర సంబంధంగా మారింది. సంధ్య కొద్దిరోజుల తర్వాత తన కాపురం చెడిపోతుందని భావించి మహేష్‌ను దూరం పెట్టింది.
దీంతో కోపం పెంచుకున్న మహేష్ ఆమె హత్యకు పథకం రచించాడు. సంధ్యకు నచ్చజెప్పి ఓ రోజు మహేష్ నిర్మానుష ప్రాంతాని కి తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగారు. మత్తులో ఉన్న సంధ్యపై మహేష్ బండరాయి మోది హతమర్చాడు. ఆమె చనిపో యిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె నుంచి రూ.50 వేల నగదుతో పాటు మొబై ల్, బంగారు ఆభరణాలను అపహరించి ఉడాయించాడు. సంధ్య మృతిపై పోలీసులు అనుమానించి మహేష్‌ను విచారించారు. కానీ మహేష్ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. దీంతో పోలీసులు ఆ కేసును మూసివేశారు. దీంతో మహేష్ దుబాయికి పరారయ్యాడు. తాజాగా ట్రైనీ ఐపీఎస్ కేసును రీ ఓపెన్ చేశారు. సంధ్య మృతి కేసులో మహేష్ ప్రమేయం ఉందని అనుమానించి ఆ దిశగా విచారణ ప్రారంభించా రు. మహేష్‌ను స్వస్థలానికి రప్పించి తమదైన విచారించి అసలు నిజాన్ని అతడితోనే చెప్పించారు. అనంతరం నిందితుడిని రిమాండుకు తరలించామని ట్రైనీ ఐపీఎస్ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ నాగేశ్వర్‌రావు, భిక్కనూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.






