ఘనంగా కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు
రక్తదానం, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ, అన్నదానం
కామారెడ్డి, జూన్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరన్ సందీప్ కుమార్ జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్స్, పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు రక్తదానం చేశారు. కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సందీప్ కుమార్ చేస్తున్న కృషిని అభినందించారు.
యువ నాయకుడిగా పార్టీ అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ సందీప్ కుమార్ జన్మదిన ప్రజాసేవ దినోత్సవం గా మార్చడం విశేషంగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరన్ సందీప్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కలిసి సర్టిఫికెట్లతో పాటు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేరు , శ్రీనివాస్, సురేష్, గుడ్ల శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.






