డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట్, జూన్ 10 (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ, స్వేచ్ఛ నివాస్, సౌభాగ్యపురం కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.డ్రైనేజీ సమస్య కు పెద్ద పైప్లైన్ల ఏర్పాటు ద్వారా నే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు వచ్చి టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని ఆమె హామీ ఇచ్చారు.
గతంలో నిలిచిపోయిన 800 అభివృద్ధి పనులపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారని, నివేదికలు రాగానే టెండర్లు పిలిచి పనులు చేపడతామని, వర్షాకాలం దృష్ట్యా ప్రజలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మీర్పేట్ మిథిలా నగర్ ఏస్‌ఎన్డి పీ నాలా పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, వర్షాలు కురిసేలోపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.






