calender_icon.png 4 December, 2024 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంబాల చెరువు కట్ట సుందరీకరణ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలి

25-09-2024 06:13:06 PM

మహబూబాబాద్, విజయక్రాంతి : బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ పట్టణంలోని కంబాల చెరువు, కట్టను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల సౌకర్యార్థం, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలతో సరదాగా గడపడానికి వీలుగా చెరువు కట్టపై, సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పార్క్, లకు ప్రతిపాదనలు (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలని, సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, మున్సిపల్ డిఈ ఉపేందర్, మహబూబాబాద్ తహసిల్దార్ భగవాన్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.