calender_icon.png 19 January, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్టుకథ, పిట్టకథ

19-01-2026 01:57:36 AM

ఇలా ప్రజలను మభ్యపెట్టలేరు.. నన్నూ భయపెట్టలేరు

  1. ఆరోపణలతో నైనీ బొగ్గు టెండర్లను ఫ్రెష్‌గా పిలుమని సూచించాం
  2. తెలంగాణ వనరులు ప్రజలకు అందించడానికే రాజకీయాల్లోకి
  3. ఆ పత్రిక కథనం వెనుక రాజకీయ ఉద్దేశం
  4. ‘కొత్త పలుకు’ల ఆశలు ఎవరివో బయటపెడుతా
  5. మీడియా సంస్థల వివాదాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దు 
  6. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ.. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లపై కట్టుకథ, పిట్టకథ, చిల్లర రాతలు అల్లి ‘ఆంధ్రజ్యోతి’ కథనం రాసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఇలాంటి కథ నా ల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబో మని హెచ్చరించారు. ఇలాంటి రాతల తో ప్రజలను మభ్యపెట్టలేరు.. ‘నన్నూ భయపెట్టలేరు’.

నా జీవితం పారదర్శంగానే ఉం టుంది. వైఎస్‌ఆర్ సన్నిహితుడైన నాపై కోపంతోనే ఎవరి రాజకీయ లబ్ధి కోసమో కట్టుకథనాలను వండి వార్చారు’ అని స్పష్టం చేశారు. ఆ తొలి పలుకుల ఆశలు, మెప్పుల లోగుట్టు బయట పెడతానని పేర్కొన్నారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోస మో, అధికార హోదాను అనుభవించడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం నిర్వహిం చిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. ప్రత్యేక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.

దారి దోపిడీదారులు, బందిపోట్ల నుంచి తెలంగాణ ఆస్తులను వనరులను రక్షిం చి, వాటిని ప్రజలకు అందజేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. సింగరేణి బొగ్గు సం స్థలకు టెండర్లపై ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ కొత్త పలుకులో తనకు తోసింది రాశారని విమర్శించారు. ఓ కట్టు కథనాన్ని ఎవరి ప్రయోజనం కోస మో వండి వార్చారన్నారు. ‘టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డ్ ఖరారు చేస్తుంది.. మంత్రికి సంబం ధం ఉండదు’ అని తెలిపారు.

ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేయాలని, ఫ్రెష్‌గా పిలవమని సూచించినట్టు తెలిపారు. తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉండటంతో, రాధాకృష్ణకు నచ్చక ‘వైఎస్‌పై ఉన్న కోపంతో నాపై ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి కథనాల వల్ల అధికారులకు, మంత్రులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు.

తాను ఆత్మగౌరవం కోసం బతుకుతానని, దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని, చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి గాలికి రాలేదని, 40 సంవత్సరాలుగా సభలో, బయ ట ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసి వచ్చానన్నారు.

రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ను ఏం ఆశించి రాశారో, ఎవరి మెప్పు కోసం రాశాడో బయటపడతానని స్పష్టం చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలని తాను స్పందించడం జరిగిందన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటో తెలిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని, గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతానని చెప్పారు.

ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసే కథనాలు రాసే అధికారం ఎవరికీ లేదని, నాయకుల మధ్య విభేదాలు సృష్టించేందుకు కట్టుకథలు రాశారని ఆరోపించారు. దీనికి భయపడి లొంగిపోయే వ్యక్తిని కాదని, ఓ ఛానల్ కథనంలో ‘నా పేరును అనవసరంగా తీసుకువచ్చారు’ అని అన్నారు. మీడియా సంస్థల మధ్య ఉన్న విషయాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దని, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లడం తగదని సూచించారు. ఏమైనా ఉంటే ‘మీరు మీరు చూసుకోవాలి’ అన్నారు. త్వరలో పూర్తి వివరాలతో అన్ని విషయాలు వివరిస్తానని భట్టి తెలిపారు.