21-12-2025 11:54:06 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో ఉన్న కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలేశ్ డి.పటేల్(దాజీ) మాట్లాడుతూ... ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉండవచ్చని, ఒత్తిడి, ఆందోళనను జయించవచ్చని ఆయన పేర్కొన్నారు. మనసు కేంద్రంగా ధ్యానం చేస్తే సత్ఫలితాలు ఉంటాయని, మనసు ప్రశాంతంగా ఉంటే ఏకాగ్రత వస్తోందన్నారు. ఏకాగ్రత ద్వారా సునాయాసంగా విజయాలు సాధించవచ్చని, ధ్యానం చేశాక వచ్చే మార్పును మీరు గమనించవచ్చని దాజీ చెప్పారు.