21-12-2025 11:27:36 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆదివారం జరుగుతుంది. నందిగామలో ఉన్న కన్హా శాంతి వనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సీపీ రాధాకృష్ణన్, జిష్ణుదేవ్ వర్మ ఒకే వేదికపై ధ్యానం చేశారు. ఈ కార్యక్రమం శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ రాత్రి 8 గంటలకు కన్హా శాంతివనం వేదికగా వర్చువల్ ద్వారా లక్ష మందితో జరిగే ఆన్ లైన్ ధ్యానం కోసం meditationday.global/enలో లాగాన్ అవ్వండని నిర్వాహకులు తెలిపారు.