26 June, 2026 | 12:47 PM

వెనెజువెలాలో 235కు చేరిన భూకంప మృతుల సంఖ్య

26-06-2026 11:26 AM

లాగ్వైరా: వెనిజులాలో సంభవించిన భారీ భూకంపం(Venezuela Earthquakesకారణంగా మరణించిన మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ భూకంపాల వల్ల సుమారు 235 మంది మరణించగా, కనీసం 4,300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం వెనిజులా వాసులు కూలిపోయిన భవనాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలించగా, రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించిన ఉత్తర ప్రాంతాలకు సహాయక బృందాలు హుటాహుటిన చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపారు. 

వెనిజులాలో గత శతాబ్ద కాలంలోనే అత్యంత శక్తివంతమైనవిగా నిలిచిన 7.2, 7.5 తీవ్రత కలిగిన భూకంపాలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఈ ప్రాంతమంతటా ఈ భూకంపాల కారణంగా వేలాది మంది గల్లంతయ్యారు. అలాగే మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వెనెజువెలా వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. అమెరికా 150 మిలియన్ డాలర్లు సాయం చేయగా, జర్మనీ సహాయక చర్యల్లో పాలుపంచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.