గాంధీ ఆస్పత్రిలో చర్లపల్లి జైలు ఖైదీ మృతి
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో(Gandhi Hospital) చికిత్స పొందుతూ చర్లపల్లి జైలు ఖైదీ మృతి చెందాడు. అత్యాచారం కేసులో 10 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సోన్న అడెల్లు నిన్న మధ్యాహ్నం 2.33 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాజెనిక్ షాక్ తో మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిర్మల్ జైలు నుంచి ఖైదీ చర్లపల్లి కేంద్ర కారాగారానికి బదిలీ అయ్యాడు. ఛాతినొప్పి, ఒళ్లు నొప్పులతో పలుమార్లు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ నెల 24న గుండె పోటుతో ఆస్పత్రిలో చేర్పించిన వైద్యులు డయాలసిస్ నిర్వహించారు. చికిత్స పొందుతుండగానే నిన్న ఖైదీ మృతి చెందాడు. దీంతో జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చర్లపల్లి జైలు జైలర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.






