2 April, 2026 | 2:30 AM

పోచారం ఐటీ కారిడార్ సీఐగా కనకయ్య గౌడ్

02-04-2026 12:41 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా కె. కనకయ్య గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పోచారం పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన బి.రాజు వర్మ సైబర్ క్రైమ్ పీఎస్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కనకయ్యను పోచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది, పలువురు స్థానిక నాయకులు స్వాగతం పలికి సన్మానించారు.