29-04-2025 12:00:00 AM
విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యాన ర్లపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్, కాజల్, మధుబాల వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కథానాయకు డు విష్ణు.. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలకు తెర తీయ నున్నారు. ఈ మేరకు మే 8న అమెరికాలో మొదలు పెట్టనున్నట్టు తాజాగా ప్రక టించారు. న్యూజెర్సీలో రోడ్ షోతో మొదలుపెట్టి ఆ తర్వాత డల్లాస్, లాస్‌ఏంజి ల్స్‌లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలోని ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ వర్కింగ్ విజువల్స్‌ను ఎంపిక చేసిన కొంతమంది ప్రేక్షకులకు చూపించనున్నారు.