29-04-2025 12:00:00 AM
కే సుధాకర్‌రెడ్డి, అరుణ్‌రాజ్, పూర్ణచంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ముత్తయ్య’. ఈ చిత్రాన్ని భాస్కర్ మౌర్య దర్శకత్వంలో వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మించారు. మే 1 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వ స్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవా రం స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు.
ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ‘నటుడు కావాలనేది అరవై యేళ్ల వయస్కుడైన ముత్తయ్య కల. తమ సొంతూరు చెన్నూరుకు ఏ సినిమా షూటింగ్ వాళ్లు వచ్చినా తనకో క్యారెక్టర్ ఇమ్మని అడుగుతుంటాడు. నాటకాల్లో డైలాగ్స్ బాగా చెప్తూ తన నటనా ప్రతిభను ప్రదర్శించే ముత్తయ్యకు ఆర్థిక పరిస్థితులు సహకరించవు. కుటుంబం, స్నేహితుల ప్రోత్సాహమూ అందదు.
ఈ ఇలాంటి పరిస్థితులన్నీ దాటుకొని ముత్తయ్య కలను ఎలా నెరవేర్చుకున్నాడనేది ట్రైలర్‌లో చూపించారు. ‘కలను వెంటనే నెరవేర్చుకోవాలి.. లేదంటే అప్పుడే చంపేసుకోవాలి. కానీ వెంటపెట్టుకుని తిరగకూడదు’ అంటూ ముత్తయ్య చెప్పే డైలాగ్ అతని మానసిక సంఘర్షణను వ్యక్తపరుస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి; సంగీతం-: కార్తీక్ రోడ్రిగ్స్; ఎడిటర్: సాయి మురళి; ఆర్ట్: బాలు.