15 March, 2026 | 5:41 PM

Breaking News

మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •  

బహుజన రాజ్యాధికార సిద్ధాంతకర్త కాన్షిరాం

15-03-2026 12:00 AM

 నేడు కాన్షిరాం జయంతి :

ఆధునిక భారతదేశ సామాజిక, రాజకీయ పరిణామ క్రమంలో అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవానికి, రాజకీయ చైతన్యానికి ని లువెత్తు నిదర్శనం మాన్యువర్ కాన్షీరాం. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రతిపాదించిన సామాజిక సమానత్వ కాంక్షను, బాబాసాహెబ్ అంబేద్కర్ కల లుగన్న రాజకీయ సార్వభౌమాధికార లక్ష్యాన్ని సమన్వయం చేసుకుని, బహుజన రాజ్యాధికార కల కన్నారు.

సామాజిక సమస్యలకు రాజ్యాధికారమే ఏకైక పరిష్కారమని ఆయన విశ్వసించారు. సమాజంలో ‘ఎవరి జనాభా ఎంత ఉందో, వారికి అధికారంలో వాటా అంత’ అనే విప్లవాత్మక నినాదంతో దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, మైనారిటీలను ఒకే తాటిపైకి తె చ్చిన అపూర్వ దార్శనికుడు కాన్షిరాం. ఆయన 1934 మార్చి 15న పంజాబ్‌లోని రూపానగర్ జిల్లా ఖవాస్‌పూర్ గ్రామంలో ఒక సాధా రణ కుటుంబంలో జన్మించారు.  సైన్స్‌లో పట్టభద్రుడైన కాన్షిరాం మహారాష్ట్రలోని పుణెకు చేరుకున్నారు.

అక్కడి ఎక్స్‌ప్లోజివ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీలో సైంటిస్ట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన వృత్తి జీవితం కొనసాగుతుండగా అంబేద్కర్ జయంతికి, యాజమాన్యం సెలవు నిరాకరించడం, ఒక దళిత ఉద్యోగిపె దాడి జరగడం వంటి ఘటనలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. అప్పటివరకు కేవలం ఒక ఉద్యోగిగా ఉన్న ఆయన, అంబేద్కరిజంపై లోతైన అధ్యయనం ప్రారంభించారు.

కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతోనే అణగారిన వర్గాల తలరాతలు మారవని, వ్యవస్థలో మార్పు రావాలంటే అధికారం చేజిక్కించుకోవాలని బలంగా నమ్మారు. ఈ క్రమంలోనే ఆయన 1978లో ‘బామ్‌సెఫ్’ సంస్థను స్థాపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ ఉద్యోగులను ఏకం చేయడానికి ఆయన రాష్ట్రాల వారీగా పర్యటించారు.

చదువుకు న్న విద్యావంతులు తమ సంపాదనలో కొంత భాగాన్ని, సమయాన్ని , మేధస్సును తిరిగి సమాజానికి ఇవ్వాలనే నినాదాన్ని ఆయన బలంగా వినిపించారు. తన ప్రసిద్ధ గ్రంథం ‘చెంచా యుగం’ ద్వారా ఆధిపత్య కులాల నేతలు నడిపే రాజకీయ పార్టీల పంచన చేరి, వారి కీలుబొమ్మలుగా మారుతూ సొంత జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టే నాయకులను ‘చెంచాలు’గా అభివర్ణించారు. బీసీలు, దళితులు కేవలం ఓటు బ్యాంకులుగా మిగి లిపోకూడదని 1984లో బీఎస్పీని స్థాపించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఆయన చేసిన రాజకీయ ప్రయోగాలు యావత్ దేశాన్నే ఆశ్చర్యపరిచాయి. వెనుకబడిన వర్గాల మద్దతుతో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కూకటివేళ్లతో పెకలించి, తన శిష్యురాలైన మాయావతిని ముఖ్యమంత్రిని చే యడం ద్వారా బహుజన అధికారం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించారు కాన్షిరాం. ఆయన దృ ష్టిలో అధికారమనేది సామాజిక మార్పునకు నాంది పలికే  ‘మాస్టర్ కీ’. ఆయనకు సొంత ఆస్తి లేదు. పెళ్లి చేసుకోలేదు. పూర్తిగా సమాజ సేవకే అంకి తమయ్యారు.

తన చివరి రోజుల్లో ఆయన సందేశం అత్యంత శక్తిమంతమైనది. తన అస్థికలను గంగానదిలో కలపవద్దని, బదులుగా దేశవ్యాప్తంగా ఉన్న బహుజన కార్యకర్తలకు పంచాలని, వారు ఆ అస్థికలను చూస్తూ రాజ్యాధికార లక్ష్యం కోసం నిరంతరం పోరాడాలని కోరారు. మతం, కులం పేరుతో విడిపోయిన మెజారిటీ ప్రజలను ‘బహుజన’ అనే ఒకే గొడుగు కిందకు తెచ్చి, దేశంలోనే ఒక రాజకీయ శక్తిగా బీఎస్పీని నిలబెట్టిన కాన్షీరాం, అణగారిన వర్గాల గుండెల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిన విప్లవకర్తగా నిలిచిపోతారు.

- కారుణ్య, హైదరాబాద్