ప్రైవేట్‌కు దీటుగా అంగన్‌వాడీలు

28-04-2024 01:03:05 AM

డబ్ల్యూడీసీడబ్ల్యూ రాష్ట్ర డైరెక్టర్ కాంతి వెస్లీ

నర్సాపూర్, ఏప్రిల్ 27: రాష్ట్రంలో ప్రైవే టు ప్రీప్రైమరీ స్కూల్స్‌కు దీటుగా అంగన్ వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కాంతి వెస్లీ తెలిపారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే, ఐసీడీఎస్ 44వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంతి వెస్లీ అంగన్‌వాడీ చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులతో కలిసి కాంతి వెస్లీ డాన్స్ చేశా రు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సూపర్వైజర్లు, ఉపాధ్యాయులను సన్మానించారు.

ఈ సందర్భంగా కాంతి వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐసీడీఎస్ సేవలు గ్రామా ల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, గర్భిణులకు, శిశువులకు ఎంతో  ఉపయోగపడుతు న్నాయని చెప్పారు. నర్సాపూర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సేవలు అందిస్తున్న సీడీపీఓ, అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జేడీ పీడీ  బ్రహ్మాజీ, ఎంపీడీవో రమాదేవి, సీడీపీవోలు హేమా భార్గవి, స్వరూపా, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్ పటేల్, జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శాంత తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ మండలంలోని లింగాపూర్, పెద్ద చింతకుంట అంగన్‌వాడీ కేంద్రాలను  పరిశీలించారు.