13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కరసామి భార్య..పేరు.. సెల్లి

25-03-2026 12:00 AM

ధనుష్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై కే గణేశ్ నిర్మిస్తున్నారు. శక్తిమంతమైన ప్రతినాయకులతో పోరాడేందుకు హింసా మార్గాన్ని ఎంచుకునే పత్తి రైతు ‘కరసామి’ పాత్రలో ధనుష్ నటిస్తుండగా, ఆయన సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా చిత్ర యూనిట్ కథానాయకి మమిత బైజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మమిత ఎప్పుడూ లేనివిధంగా చాలా డీ-గ్లామరస్ లుక్‌లో కనిపిస్తోంది. ఎలాంటి మేకప్ లేకుండా, మెరూన్ కలర్ చీరలో, ఒక పాత ఇంట్లో బాధగా కూర్చుని ఉన్న ఆమె లుక్ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఆమె ధనుష్ భార్యగా ‘సెల్లి’ అనే పాత్రలో నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

పెళ్లయిన మహిళగా మమిత నటన ఈ సినిమాకు హైలైట్ కానుందని సమాచారం. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, కరుణాస్ జయరామ్, పృథ్వీ పాండియారాజన్, సూరజ్ వెంజరమూడు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.