18 April, 2026 | 2:24 PM

సమైక్యతకు చిహ్నం కరీంనగర్

01-04-2025 01:45 AM

కరీంనగర్, మార్చి31 (విజయక్రాంతి): కరీంనగర్ నగరం అంటే హిందూ ముస్లిం క్రైస్తవుల కలయికతో ఉన్న నగరం అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని  కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి ఈద్గా వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న  ముస్లిం లను కలిసి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. పవిత్రమైన రమజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఒక నెల రోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షతో ఉండి ఈరోజు పవిత్రమైన రమజాన్ పండుగ నిర్వహించుకుంటున్నారని ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే నేడు కూడ నగరవ్యాప్తంగా ఈద్గాల వద్ద   వద్ద ముస్లిం సోదరులు ప్రార్థన జరుపుకొని పండుగ చేసుకున్నారని తెలిపారు.

ఈ నగరంలో అందరు మతస్థులు కోరుకునేది కేవలం అభివృద్ధి మాత్రమేనని, భావితరాలకు  బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ  కలిసిమెలిసి జీవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో  నగర బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ సుదగోని మాధవి- కృష్ణ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ఏదుళ్ళ రాజశేఖర్, దిండిగల మహేష్,  అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, నగర బి ఆర్‌ఎస్ మైనార్టీ శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, బిఆర్ ఎస్ నాయకులు జెల్లోజీ శ్రీనివాస్, నవాజ్ హుసేన్, తదితరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన మాజీ మేయర్

కరీంనగర్ క్రైమ్, మార్చి31 (విజయక్రాంతి): కరీంనగర్ 33వ డివిజన్ భగత్ నగర్ లో నగర మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ని కలిసిన ముస్లిం లకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదర, సోదరీమణులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈద్ ముబారక్ తెలియజేశారు.

రంజాన్ వేడుకల్లో కోమటిరెడ్డి

కొత్తపల్లి, మార్చి31 (విజయక్రాంతి): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని రేకుర్తి సాలెహనగర్ ఈద్గా మైదానం వద్ద సామూహిక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.