18 April, 2026 | 3:49 PM

ప్రభుత్వ నియంత పోకడలకు వ్యతిరేకంగా పోరాడుదాం

01-04-2025 01:41 AM

సూర్యాపేట,మార్చి31(విజయక్రాంతి): విద్యార్ధుల పట్ల నియంతల వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ పిలుపునిచ్చారు. వందలాది ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేస్తూ అరెస్ట్ చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు.

సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో నిర్వహించిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధుల ఐక్యత(పిడిఎస్యు) ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో  నాయకులు వంటి కొమ్ము నగేష్, మాతంగి విజయ్, అరుణ్, నితిన్, రాజు  పాల్గొన్నారు.