18 May, 2026 | 2:48 AM

కరీంనగర్ మార్కెట్‌కు కొత్త రూపు

18-05-2026 01:54 AM

కొత్తపల్లి, మే17(విజయక్రాంతి):కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి రైతులకు మరిం త అనుకూలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న తెలిపారు. మార్కెట్ యార్డు దశదిశను మార్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు.

రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో పలు ప్రాం తాల్లో లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయించామని తెలిపారు. అదేవిధంగా తాగునీరు, పారిశుధ్యం, షెడ్లు, రహదారులు తదితర సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.