24 August, 2026 | 11:34 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ఏసీబీ వలలో కరీంనగర్ జడ్పీ ఉద్యోగులు

18-06-2025 12:22 AM

కరీంనగర్, జూన్ 17 (విజయక్రాంతి): కరీంనగర్ జడ్పీ ఉద్యోగులు ఇద్దరు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ ఏఈఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ అద్దె కారు బిల్లు చెల్లించే విషయంలో లంచం కోసం కక్కుర్తి పడ్డారు. ప్రైవేటు క్యాబ్ యజమానికి ఆరు నెలలకోసారి వచ్చే అద్దె తాలుకు డబ్బుల్లోనూ చేయి చాపడంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

దీంతో మంగళవారం రూ.8 వేలు లంచం తీసుకుంటున్న ఏఈఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ నేతృత్వంలో ఇద్దరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నారు.