18 July, 2026 | 4:19 PM

Breaking News

గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •   రామగుండం కమీషనరేట్ లో కోర్టు డ్యూటీ అధికారుల పనితీరు మెరుగుపర్చాలి   •   పట్టణాభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించాలి   •  

సీఎం పదవి విషయం తేల్చండి

15-01-2026 02:06 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మొర

బెంగళూరు, జనవరి 14: సీఎం పదవి మార్పు అంశాన్ని తేల్చాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం ఈ మేరకు సీఎంతోపాటు డిప్యూటీ సీఎం శివకుమార్ భేటీ అయ్యారు. భేటీ తర్వాత సీఎం సిద్ధరామయ్య మీడియాతో సీఎం పదవి అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ భేటీలో సీఎం సిద్ధరామయ్య ప్రధానంగా సీఎం పదవిపైనే గోడు వెళ్లబోసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సీఎం పదవి అంశంపై పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయని, రాష్ట్ర ప్రజలు కూడా దీనిపై విస్తృతంగా చర్చించుకుంటున్నారని వాపోయినట్లు తెలిపాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అల్పాహార విందుల పేరుతో అనేకసార్లు భేటీ అయినప్పటికీ సీఎం పదవి వివాదం కొలిక్కిరాలేదు. మరోవైపు డీకే శివకుమార్ తనకే సీఎం పదవి కట్టబెట్టాలని పట్టుబుడుతన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.