థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం
రైలుపై పడిన భారీ క్రెయిన్
32 మంది మృతి.. ౭౦ మందికి గాయాలు
బ్యాంకాక్, జనవరి 14: థాయ్‌లాండ్‌లో బుధవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ రైలుపై క్రెయిన్ పడి ౩౨ మంది తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. ౭౦ మంది ప్రయాణికులు క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి రైలు పెట్టెలు నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, ఒక భోగిలో మంటలు చెలరేగడంతో మిగిలిన ప్రయాణికులు కూడా భీతిల్లారు. ఈశాన్య థాయ్‌లాండ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై థాయ్‌లాండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చైనా ఆర్థిక సహకారంతో బ్యాంకాక్ నుంచి లావోస్ వరకు నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు పనుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ఆ దేశ ప్రధాని అనుతిన్ చార్న్విరకుల్ ప్రకటించారు.




