22 March, 2026 | 2:28 PM

ప్రైవేటు వ్యక్తులు జల్లికట్టు నిర్వహించొద్దు!

15-01-2026 02:08 AM

మద్రాస్ హైకోర్టు

చెన్నై, జనవరి 14: తమిళులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే జల్లికట్టు నిర్వహణపై మద్రాస్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. ‘జల్లికట్టు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కాదు.. తమిళుల సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీక. ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీలను ప్రైవేటు సంస్థలు నిర్వహించకూడదు. ప్రభుత్వం మాత్రమే నిర్వహించాల’ని తేల్చిచెప్పింది. పోటీలను ప్రైవేట్ వ్యక్తులు లేదా గ్రామ కమిటీలు నిర్వహించొద్దనే ఆదేశాలివ్వాలని పి.మురుగన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది. మరోవైపు పోటీలకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈనెల ౧౭న మధురై జిల్లాలోని ఏరుతళువుతలణలో సీఎం ఎంకే స్టాలిన్ పోటీలను ప్రారంభించనున్నారు.