సంక్షేమ కార్యక్రమాలకే వెంకయ్య జీవితం అంకితం: ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్
17-08-2024 04:00 PM
ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ ఖడ్ నెల్లూరులో పర్యటించారు. శనివారం ఉదయం అక్షర విద్యాలయానికి చేరుకున్న ఉపరాష్ట్ర పతి దన్ ఖడ్, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులకు మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు ఘన స్వాగతం పలికారు. స్వర్ణ భారతి ట్రస్టు 23వ వార్షికోత్సవం సభలో ఉపరాష్ట్ర పతి పాల్గొన్నారు. జ్యోతీ ప్రజ్వలన కార్యక్రమానంతరం ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. సంక్షేమ కార్యక్రమాలకోసం, గ్రామీణ భారతంలో సేవకు ఆయన కంకణం కట్టుకున్నారని ధన్ ఖడ్ కొనియాడారు. సమరయోధుల కలల నేడు సాకారమవుతున్నాయని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






